ఆ కారణంతోనే నా తాగుడు హద్దులు దాటింది.. చివరికి రిహాబిలిటేషన్ సెంటర్ వరకు తీసుకెళ్లింది: చాహల్
Advertisement
- విడాకుల తర్వాత మద్యానికి బానిసైనట్లు అంగీకరించిన చాహల్
- 26 రోజుల పాటు రిహాబిలిటేషన్ సెంటర్లో ఉన్నట్లు వెల్లడి
- భార్య ధనశ్రీ వర్మతో విడాకుల తర్వాతే సమస్య తీవ్రమైందని వ్యాఖ్య
- రిహాబ్ తర్వాత మానసికంగా, శారీరకంగా ఫిట్‌గా మారానన్న చాహల్
- క్రికెట్ కెరీర్‌ను కాపాడుకోవడానికే చికిత్స తీసుకున్నట్లు స్పష్టీకరణ
Advertisement
టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి సంచలన విషయాలు వెల్లడించాడు. భార్య, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మతో విడాకుల తర్వాత తాను మద్యపానానికి బానిసయ్యానని, దాని నుంచి బయటపడేందుకు 26 రోజుల పాటు రిహాబిలిటేషన్ సెంటర్లో చికిత్స తీసుకున్నానని తెలిపాడు. ఈ కఠినమైన దశను అధిగమించి ఇప్పుడు మానసికంగా, శారీరకంగా ఎంతో మెరుగ్గా ఉన్నానని చాహల్ పేర్కొన్నాడు.
భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రాకు ఇచ్చిన పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో చాహల్ ఈ విషయాలను పంచుకున్నాడు. "2022 నుంచి మేమిద్దరం వేర్వేరుగా ఉన్నాం. 2025 మార్చిలో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నాం. ఆ తర్వాత, ముఖ్యంగా గత ఏడాది కౌంటీ క్రికెట్ ఆడిన తర్వాత నా మద్యపానం హద్దులు దాటింది. అందుకే రిహాబ్ సెంటర్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నాను. అక్కడ 26 రోజులు ఉన్నాను. ఇప్పుడు దానిని ఎలా నియంత్రణలో ఉంచుకోవాలో నాకు తెలుసు" అని చాహల్ వివరించాడు.
రిహాబ్‌లో ఉండటం వల్ల తనలో భావోద్వేగ సమతుల్యత, పరిణతి పెరిగాయని చాహల్ తెలిపాడు. శారీరకంగానూ ఎంతో ఫిట్‌గా మారానని, గత ఐపీఎల్ సీజన్లో తాను మళ్లీ 30 ఏళ్ల వాడిలా చురుగ్గా కదిలానని ఆనందం వ్యక్తం చేశాడు. 2011 ఐపీఎల్ ఆడే రోజుల్లో సరదాగా స్నేహితులతో కలిసి మద్యం తీసుకోవడం మొదలుపెట్టానని, అయితే విడాకుల తర్వాత అది వ్యసనంగా మారిందని అన్నాడు.
తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న వార్తల వల్ల తీవ్రమైన ఆందోళన, పానిక్ ఎటాక్స్ కూడా ఎదుర్కొన్నట్లు చాహల్ వెల్లడించాడు. తాను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే క్రికెట్ కెరీర్‌కు ఈ వ్యసనం వల్ల నష్టం జరుగుతుందని గ్రహించానని, అందుకే కుటుంబ సభ్యులు, స్నేహితుల మద్దతుతో చికిత్స తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశాడు. అప్పట్లో తన సహచర ఆటగాడు ఏబీ డివిలియర్స్ జీవితంలో సమతుల్యత ఎంత ముఖ్యమో చెప్పిన మాటలను కూడా ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నాడు.